సిద్దు-విశ్వక్ సేన్ లతో బాలయ్య !

నందమూరి బాలయ్య మరోసారి బుల్లితెర మీద గర్జించబోతున్నారు. అక్టోబర్ 14 నుంచి అన్ స్టాపబుల్ 2 షురూ కానుంది. కొద్దిసేపటి క్రితమే ట్రైలర్ రిలీజైంది. మరింత రంజుగా అంటూ బాలయ్య ఊరించారు. అయితే ఈసారి గెస్టుల లిస్ట్ డిఫరెంట్ గా ఉండబోతుందని సమాచారమ్.

 ఈ సీజన్ కోసం జంట జంటగా సినిమా, రాజకీయ జనాలతో ఎపిసోడ్ లు చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు-లోకేష్ లతో ఎపిసోడ్ చేసారు. లేటెస్ట్ గా సిద్దు జొన్నలగడ్డ-విష్వక్ సేన్ లతో ఒక ఎపిసోడ్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ షూట్ ఈ రోజు అన్నపూర్ణలో చిత్రీకరిస్తున్నారు. ఇక ఎన్టీఆర్క-ళ్యాణ్ రామ్ లేదా ఎన్టీఆర్-కొరటాల, అలాగే మెగాస్టార్ లాంటి ఎపిసోడ్ లు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.