కాజల్ యంగ్ హీరోని పట్టేసిందిగా.. !
చందమామ కాజల్ టాలీవుడ్ యంగ్ హీరోతో రొమాన్స్ స్టార్ట్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్, కోలీవుడ్ లోనూ కాజల్ స్టార్ హీరోయిన్ అనిపించుకొంది. స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడింది. ఇప్పుడీ ముద్దుగుమ్మకు ముదిరిపోవడంతో ఆఫర్లు బాగా తగ్గాయి. దీనికితోడు ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్ హవా మొదలైంది. ఈ నేపథ్యంలో కాజల్ పనైపోయిందని భావించారు. ఐతే, ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ కోసం తనలోని ‘పక్కా లోకల్.. ‘ అందాలని చూపించి మళ్లీ ఫాంలోకి వచ్చేసింది కాజల్.
ఆ వెంటనే మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం. 150’, రానా ‘నేనే మంత్రి నేనే రాజు’ సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొంది. హిట్స్ దక్కాయి. కానీ, కాజల్ వైపు యంగ్ హీరోలు చూడటం లేదు. ఈ నేపథ్యంలోనే ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాల వైపు ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే తమిళ్ క్వీన్ ‘పారిస్ పారిస్’లో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇక్కడి వరకు బాగనే ఉన్నా.. ఇకపై కాజల్ కు యంగ్ హీరోలు దొరకడం కష్టమే అనే ప్రచారం జరుగుతోంది. ఐతే, ఇప్పుడీ ప్రచారానికి చెక్ పెడితూ కాజల్ యంగ్ హీరోతో రొమాన్స్ చేసేందుకు రెడీ అయ్యింది.
సెన్సిటివ్ దర్శకుడు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు కె.యస్ రామారావు నిర్మాత. ఈ సినిమా కోసం హీరోయిన్ గా కాజల్ ని తీసుకొన్నట్టు తెలిసింది. ఈ సినిమాను అక్టోబర్ 10 నుంచి ప్రారంభించనున్నారు. ఈ ఆఫర్ తో కాజల్ మళ్లీ యంగ్ హీరోలతో ఓ రౌండ్ వేస్తుందేమో చూడాలి.