ప్రేమలాంటివి సహజంగా పుడతాయి

ముద్దుగుమ్మ రష్మిక, విజయ్‌ దేవరకొండపై ఇటీవల కాలంలో రకరకాల రూమర్స్‌ వస్తున్న సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా వీరిద్దరూ కలిసి మాల్దీవుల టూర్ వెళ్లారు. దీంతో.. ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటి కానుంది. ఈ ఏడాదే నిశ్చితార్థం. వచ్చే ఏడాది పెళ్లి అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై రష్మిక ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడారు.

ము మొత్తం 15 మంది స్నేహితులం ఉన్నాం. మాకు వీలున్నప్పుడల్లా మేమంతా కలిసి సమయాన్ని గడుపుతాం. నేను, విజయ్‌ చాలా సన్నిహితంగా ఉంటాం. నాకు సినిమాలకు సంబంధించి ఏదైనా సందేహం వస్తే విజయ్‌ని అడుగుతాను. మేము మంచి స్నేహితులం మాత్రమే. మేము అన్ని విషయాలను పంచుకుంటాం. వాటి గురించి చర్చించుకుంటాం. ప్రస్తుతం రిలేషన్‌షిప్‌ గురించి ఆలోచించే సమయం నాకు లేదు. మనం ఏదైనా బంధంలో ఉంటే దానికి సమయం వెచ్చించాల్సి ఉంటుంది. నా దృష్టంతా పనిపైనే ఉంది. ప్రేమలాంటివి ఏవైనా సహజంగా పుడతాయి అంటూ అన్ని చెప్పుకొస్తూ అసలు విషయాన్ని దాటవేసింది.