ట్రైలర్‌ టాక్ : రామ్‌ సేతు

అక్షయ్‌కుమార్‌ హీరోగా దర్శకుడు అభిషేక్‌ శర్మ తెరకెక్కించిన చిత్రం ‘రామ్‌ సేతు’. జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, నుస్రత్‌ బరూచా కథానాయికలు. టాలీవుడ్ నటుడు సత్యదేవ్‌ కీలక పాత్రలో నటించారు. దీపావళి కానుకగా ఈ నెల 25న రామ్ సేతు ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా రామ్ సేత్ ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్రబృందం. ‘ఈ దేశం శ్రీరాముడిపై నమ్మకంతో నడుస్తుంది’ అంటూ నటుడు నాజర్‌ పరిచయ సన్నివేశంతో ప్రారంభమైన ట్రైలర్‌… రామసేతు వారధి రహస్యాల నేపథ్యంలో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇతిహాసాలను ల్లోని నిజాన్ని వెలికితీసే వ్యక్తిగా అక్షయ్‌ కనిపించారు. 7000 ఏళ్ల క్రితంనాటి సంగతులు తెలుసుకునే క్రమంలో అక్షయ్‌, సత్యదేవ్‌ చేసిన సాహసం, విలన్ల గ్యాంగ్‌తో పోరాటం.. ఆకట్టుకున్నాయి.