గబ్బర్ బన్ గయా బాలీవుడ్ హీరో
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సోనాక్షి సిన్హా, హ్యూమా ఖురేషీ ప్రధాన పాత్రల్లో నటించిన ‘డబుల్ ఎక్స్‌ఎల్ (Double XL)’ సినిమాలో ధావన్ అతిథి పాత్రలో నటించాడు. ఇందుకు సంబంధించిన ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో ధావన్.. హ్యూమాతో కలిసి డ్యాన్స్ చేస్తు్న్నాడు. ఈ ఫొటోను హ్యూమా రీట్వీట్ చేసింది. సమాజంలో బొద్దుగా ఉండే మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంతో వినోదాత్మకంగా తీర్చిదిద్దిన ఈ సినిమా ఇది. సతరమ్ రమానీ దర్శకత్వం వహించారు. వంబరు 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాలీవుడ్ ఎంట్రీ పై ధావన్ మాట్లాడుతూ.. “దేశం తరఫున ఆడే నా లాంటి అథ్లెట్ జీవితం క్షణం ఖాళీ లేకుండా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ నేను తీరిక చేసుకుని అప్పుడప్పుడు మంచి సినిమాలు చూస్తుంటాను. ఈ సినిమా అవకాశం నాకు వచ్చినప్పుడు ముందు కథ విన్నాను. అది నా మనసును తాకింది. ఈ చిత్రం సమాజానికి మంచి సందేశాన్నిస్తుంది. మనం ఎలా ఉన్నా.. మన కలలను నెరవేర్చుకోవచ్చన్న విశ్వాసాన్ని నింపుతుంది” అన్నారు.