సరోగసి వివాదం.. నయన్ దంపతులకు పదేళ్ల జైలు శిక్ష ?
పెళ్లైన నాలుగు నెలలకే నయన్-విఘ్నేష్ శివ తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. తమకు కవలలు పుట్టారంటూ ఈ దంపతులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. ఎలా పిల్లల్ని కన్నారు. సరోగసి ద్వారా ? అయితే అది నేరం అంటూ విమర్శలు వచ్చాయి. పోలీస్ కేసులు, పిటిషన్లు నమోదైనట్టు ఉన్నాయి. మన దేశంలో సరోగసి ని నిషేధించారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇది అమలులోకి వచ్చింది. యన సరోగసీ ద్వారా తల్లి అవ్వడం చట్ట బద్ధంగా జరిగిందా? లేదా? అనేది విచారించడానికి తమిళనాడు ప్రభుత్వం ఓ త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ వారం రోజుల పాటు నివేదిక ఇవ్వాలి. అందుకోసం నయన తార. విఘ్నేష్‌లు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది.
సరోగసీ విషయంలో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. వాటిని నయన తార అతిక్రమించిందన్నది ప్రధాన ఆరోపణ. అదే నిజమైతే.. పది సంవత్సరాల జైలు శిక్ష, పది లక్షల జరిమానా విధించే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కేరళకు చెందిన ఓ యువతి… సరోగసీ ద్వారా బిడ్డల్ని కని, నయనతారకు అప్పగించిందని విచారణలో తేలింది. ఆమె నయనకు స్నేహితురాలని తెలుస్తోంది.