సలార్‌ : యాంగ్రీ లుక్‌లో పృథ్వీరాజ్‌

కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ నటిస్తోన్న బిగ్గెస్ట్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సలార్‌’ . మలయాళీ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆదివారం పృథ్వీరాజ్‌ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రియులకు ‘సలార్‌’ టీమ్‌ అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చింది. పృథ్వీరాజ్‌ లుక్‌ని రివీల్‌ చేసింది.

వరదరాజ మన్నార్‌ పాత్రలో పృధ్వీరాజ్ యాంగ్రీ లుక్‌లో కనిపించారు. బొగ్గు గనుల నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇందులో ప్రభాస్‌ రఫ్‌ లుక్‌లో కనిపించనున్నారు. శ్రుతిహాసన్‌, జగపతి బాబు తదితరులు నటిస్తున్న ఈ చిత్రం హోంబలే ఫిల్మ్స్‌ పతాకంపై రూపుదిద్దుకుంటోంది.