అన్‌స్టాపబుల్‌కు త్రివిక్రమ్ ఎప్పుడొస్తున్నాడో తెలుసా ?

అన్‌స్టాపబుల్‌-2 సరికొత్త ప్రోమో విడుదలైంది. విశ్వక్‌ సేన్‌, సిద్ధు జొన్నలగడ్డ పాల్గొని సందడి చేశారు. సిద్ధు లుక్‌ చూసిన బాలయ్య.. ‘‘మేకప్ మేన్‌, హెయిర్‌స్టైలిష్ట్‌.. ఎవరయ్యా సిద్ధు బాబు తల దువ్వకుండా పంపించారు’’ అంటూనే.. తాను మెస్సీ లుక్‌లో కనిపించిన సినిమాలన్నీ ఫ్లాప్‌ అయ్యాయని సరదాగా చెప్పారు.

ఇదే ఎపిసోడ్‌లో నిర్మాత నాగవంశీ కనిపించి.. తమ బ్యానర్‌ నుంచి త్రివిక్రమ్‌ బయటకు వెళ్లడం ఇష్టం లేదని చెప్పారు. అనంతరం బాలయ్య.. దర్శకుడు త్రివిక్రమ్‌కు ఫోన్‌ చేసి.. ‘‘అన్‌స్టాపబుల్‌కు ఎప్పుడు వస్తున్నావ్‌?’’ అని ప్రశ్నించారు. ‘‘మీరు ఓకే అంటే వెంటనే వచ్చేస్తాను‌’’ అని డైరెక్టర్‌ చెప్పగానే.. ‘‘ఎవరితో రావాలో తెలుసుగా’’ అని బాలయ్య అనడం ఆకట్టుకుంటోంది.