జగన్ పై యుద్ధం ప్రకటించిన పవన్-బాబు

ఏపీ రాజకీయాలు కీలక మలుపు తీసుకున్నాయి. ఇన్నాళ్లు బీజేపీతో కలిసి నడుస్తున్న జనసేన.. రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసే విధంగా తొలి అడుగు వేసింది. విజయవాడలో పవన్ కళ్యాణ్ – చంద్రబాబు కలిశారు. గంటల తరబడి సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు. ముందుగా ఏపీలో ప్రజాస్వామ్యాన్ని బతికించాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం తొలి అడుగు పడింది. మాతో ఎవరెవరు కలిసొస్తారు అన్నది చూడాలని పవన్-బాబు అన్నారు.

ప్రజాస్వామ్యం బతకాలంటే పొలిటికల్ పార్టీలు బతకాలి. కానీ పొలిటికల్ పార్టీలను నలిపిస్తేమంటే ఎట్లా.. ? అని పవన్ ప్రశ్నించారు. టీడీపీ, సీపీఐ, సీపీఎం.. అన్ని పార్టీలు కలిసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన అవసరం ఉందన్నారు. ఇది ఎన్నికలకు సంబంధించిన అంశం కాదు.. ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి ఇది. ప్రజాస్వామ్యం బతికితే.. ఎన్నికలు తర్వాత చూసుకోవచ్చని చంద్రబాబు అన్నారు. ఇక టీడీపీ-జనసేన మళ్లీ ఒక్కటవుతాయా ? అన్న ప్రశ్నకు కచ్చితంగా వ్యూహాలు మారుతయని పవన్ స్పష్టం చేశారు.