కోహ్లీ ఇన్నింగ్స్.. నభూతో నభవిష్యతి
ఉత్కంఠ పోరులో పాక్‌పై భారత్ విజయం సాధించింది. చివరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. విరాట్ కోహ్లీ (82*) ఒంటి చేత్తో టీమ్ఇండియాను గెలిపించాడు.టాస్ గెలిచి భారత సారథి రోహిత్ శర్మ పాకిస్థాన్‌కు బ్యాటింగ్ అప్పజెప్పగా.. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. షాన్ మసూద్ (52*), ఇఫ్తికార్ అహ్మద్ (51) రన్స్ చేయడంతో ఆ జట్టు 159 పరుగులు చేసింది.
160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. 31 పరుగులకే 4వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే కోహ్లీ-హార్దిక్ ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు శతక (113) భాగస్వామ్యం జోడించారు.
చివరి 8 బంతుల్లో 28 పరుగులు అవసరం కాగా.. కోహ్లీ వరుసగా వరుసగా సిక్స్ లు కొట్టడంతో.. ఆఖరి ఓవర్ లో భారత్ కు 16 పరుగులు అవసరం అయ్యాయి. అయితే లాస్ట్ ఓవర్ తొలి బంతికే హార్ధిక్ అవుట్ కావడంతో.. విజయం అందని ద్రాక్షే అనుకున్నారు. కానీ టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. కోహ్లీ.. ఇన్నింగ్స్ నా భూతో నా.. భవిష్యత్ అన్నట్టుగా సాగింది.