కరోనా పుట్టిన వుహాన్‌లో.. మళ్లీ లాక్‌డౌన్‌

కరోనా మహమ్మారి మొట్టమొదటగా వెలుగు చూసిన వుహాన్‌లో మళ్లీ కరోనా కేసులు వెలుగు చూడడం కలవరపెడుతోంది. సుమారు 9 లక్షల జనాభా కలిగిన వుహాన్‌లోని హన్‌యాంగ్‌ జిల్లాలో మంగళవారం ఒక్కరోజే 18 కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు అత్యవసరం మినహా మిగతా కార్యకలాపాలన్నింటినీ మూసివేయాలని నిర్ణయించారు.

కరోనా కట్టడి విషయంలో చైనా ఇప్పటికీ జీరో-కొవిడ్‌ వ్యూహాన్ని పాటిస్తోంది. ఒక్క కేసు వచ్చినా లక్షల సంఖ్యలో పరీక్షలు, క్వారంటైన్‌ నిబంధనలు విధిస్తోంది.  ఈ క్రమంలో వుహాన్‌లో 10లక్షల జనాభా కలిగిన జియాంగ్‌షియా జిల్లాలో ఇటీవల లాక్‌డౌన్‌ విధించారు. షాషి ప్రావిన్సులోని డాటొంగ్‌ నగరంతోపాటు గువాంగ్‌ఝువాలోనూ కొవిడ్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి.