బిగ్ లీక్ : ఈ వారం శ్యామల అవుట్

నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా తెలుగు బిగ్ బాస్ సీజన్ – 2 ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. సీజన్ 2 సీజ న్ 1ని మించిపోయింది. రేటింగ్స్ లో కాదు. కలెక్షన్స్ లో. సీజన్ 2 భారీ లాభాలని తెచ్చిపెడుతోందని బిగ్ బాస్ యాజమాన్యం చెబుతోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎలా ఉన్నా.. శనివారం, ఆదివారం నాని ఎంట్రీ ఇచ్చి సందడి చేస్తున్నాడు. శనివారం ఊరించి, ఉడికించి ఆదివారం ఓ సభ్యుడుని ఎలిమినేట్ చేస్తున్నాడు నాని. ఇప్పటికే బిగ్ బాస్ ఇంటి నుంచి ముగ్గురు సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం సంజన, రెండో వారం నూతన్ నాయుడు, మూడో వారం కిరీటీ ఎలిమినేట్ అయ్యారు. ఇక, ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనేది ఈ (ఆదివారం) రాత్రికి తేలిపోనుంది.

ఈ వారం ఎలిమినేట్ అయ్యే సభ్యుల లిస్టులో కౌశల్‌, శ్యామల, బాబుగోగినేని, నందిని రాయ్‌, దీప్తీ, గణేశ్‌, గీతా మాధురిలు ఉన్నారు. ఐతే, వీరిలో గణేష్, గీతా మాధురి ప్రొటెక్ట్ జోన్ లోకి వెళ్లినట్టు శనివారమే ప్రకటించారు నాని. దీంతో మిగిలిన కౌశల్‌, శ్యామల, బాబుగోగినేని, నందిని రాయ్‌, దీప్తీ లలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఉత్కంఠగా మారింది. ఐతే, వీరిలో శ్యామల ఎలిమినేట్ అయినట్టు ముందే లీకైంది. బిగ్ బాస్ రూల్స్ ప్రకారం షో అయిపోయే వరకు షో వివరాలు ఎవ్వరు బయటపెట్టకూడదు.

ఐతే, ఇప్పటికే తాను బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయినట్టు యాంకర్ శ్యామల తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘నన్ను సపోర్ట్ చేసిన వారందరికీ నా థ్యాంక్స్. ఇంటికి తిరిగి వచ్చాను. ఇషాన్‌తో ఆడుకొంటున్నాను. నాకు అండగా నిలిచిన అందరికీ ప్రేమతో అభినందనలు తెలియజేసుకొంటున్నా’నని తన ఫేస్ బుక్ లో పేర్కొంది. ఆ తర్వాత కొద్దిసేపటికే తన పోస్ట్ ని డిలీజ్ చేసింది. అప్పటికే శ్యామల పోస్ట్ ని కొందరు స్క్రీన్ షాట్ తీశారు. ఇప్పుడీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరోవైపు, శ్యామల తొందరపాటు తనంపై బిగ్ బాస్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసిందే.