కరెన్సీ నోట్లపై దేవుళ్ల చిత్రాలుం.. కేజ్రీ రిక్వెస్ట్ !

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ప్రధాని నరేంద్ర మోడీకి ఓ విజ్ణప్తి చేశారు. “కొత్త కరెన్సీ నోట్లపై ఒకవైపు మహాత్మా గాంధీ చిత్రాన్ని, మరోవైపు దేవతా మూర్తులు లక్ష్మి, గణేశుడి రూపాలను ఉంచొచ్చు. దేవతల చిత్రాలు ఉంచడం వల్ల దేశం అభివృద్ధి మార్గంలో పయనిచేందుకు ఉపయోగపడుతుంది. మనం శ్రమించినా.. దైవం ఆశీస్సులు లేకపోతే మన ప్రయత్నాలు ఫలించవు. అందుకే నోట్లపై వారి రూపాలు చిత్రించాలని ప్రధాని మోడీని అభ్యర్థిస్తున్నాను.

ఇండోనేషియాలో ముస్లిం జనాభా అధికంగా ఉన్నప్పటికీ.. ఆ దేశ నోట్లపై గణేశుడి చిత్రం ఉంటుంది. ఇండోనేషియానే చేయగలిగినప్పుడు.. మన వల్ల ఎందుకు కాదు..? డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణిస్తుండటంతో దేశం క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. దేశ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించేందుకు మన ప్రయత్నాలతో పాటు దేవుడి ఆశీస్సులు కూడా అవసరం” అని అన్నారు. దీనిపై త్వరలో ప్రధాని మోడీకి లేఖ రాస్తానని క్రేజీవాల్ చెప్పారు.