టార్గెట్ రోహిత్ శర్మ
టీ20 వరల్డ్ కప్ ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్ లో పాకిస్తాన్ పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. విరాట్ కోహ్లీ తన వీరోచిత పోరాటంతో భారతదేశానికి ఒకరోజు ముందే దీపావళీ పండగను తీసుకొచ్చారు. ఈ విషయాలు పక్కనపెడితే.. ప్రతీసారి జట్టులో ఏదో ఓ లోపం ముందేసుకునే మాజీలు.. ఇన్నాళ్లు విరాట్ కోహ్లీ ఫామ్ మీద ఆందోళన వ్యక్తం చేసేవారు.. ఇప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ మీద పడ్డారు. అవునూ.. టీమిండియా ప్రస్తుతం కనిపిస్తున్న ఏకైక లోపం రోహిత్ అవుట్ ఫామ్ అంటూ.. మాజీ క్రికెటర్ గవాస్కర్ ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు.
‘ప్రస్తుతం జట్టులో ఉన్న ఏకైక సమస్య రోహిత్ శర్మ ఫామ్. కొద్దిరోజులుగా అతడి స్థాయికి తగినట్లు ఆడటంలేదు. అతడు ఆడితే ఇతరులకు బ్యాటింగ్ చేయడం ఎంతో సులువవుతుంది. మంచి ఓపెనింగ్ ఇస్తే ఆ తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి ఉండదు. వచ్చీ రాగాగే మొదటి బంతి నుంచే హిట్టింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఫలితంగా మంచి స్కోర్ సాధించవచ్చు’ అని అన్నాడు. తదుపరి జరిగే మ్యాచ్‌ల్లో మొదటి 6 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఉంటడమే కీలకం అని వ్యాఖ్యానించాడు. నెమ్మదిగా బ్యాటింగ్ చేసినా.. వికెట్ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గావస్కర్ సూచించాడు.