T20WorldCup : న్యూజిలాండ్‌ – అఫ్గాన్‌ మ్యాచ్‌ రద్దు

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బుధవారం జరిగిన రెండు మ్యాచ్ లకు వరుణ దేవుడు అడ్దంకిగా మారారు. ఉదయం జరిగిన ఇంగ్లాండ్ – ఐర్లాండ్ మ్యాచ్ కి వర్షం అడ్డు రావడంతో.. డక్ వర్త్ లూయిస్ పద్దతిలో ఐర్లాండ్ విజేతగా నిలిచింది. ఇక న్యూజిలాండ్ – ఆఫ్గాన్ మ్యాచ్ లో ఒక బంతి కూడా పడకుండా మ్యాచ్ రద్దయింది.

భారీగా వర్షం కురుస్తూ ఆగిపోకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ ఇరు జట్లకు ఒక్కో పాయింట్‌ దక్కింది. వర్షం కారణంగా సోమవారం దక్షిణాఫ్రికా, జింబాబ్వే మధ్య మ్యాచ్‌ ఫలితం తేలలేదు. ఓవల్‌ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌ను వర్షం కారణంగా అంపైర్లు రద్దు చేశారు. వర్షం కారణంగా 9 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించగా.. మొదట 5 వికెట్ల నష్టానికి జింబాబ్వే 80 రన్స్‌ చేసింది. 81 పరుగుల లక్ష్యంతో దక్షిణాఫ్రికా ఛేదనకు దిగగా.. మూడు ఓవర్ల తర్వాత మళ్లీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.