సమంత ప్రేమలో రౌడీ హీరో
రౌడీ హీరో విజయ్ దేవరకొండ సమంత ప్రేమలో పడ్డారు. అయితే ఇది ఇప్పుడు కాదు. ఆయన కాలేజీ రోజుల్లోనే. ఈ విషయాన్ని విజయ్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. సమంత మీద బీభత్సమైన క్రష్ ఉందని చెప్పారు. ఇక సామ్ ప్రధాన పాత్రలో నటించిన ‘యశోద’ ట్రైలర్ ను గురువారం విడుదల చేసిన విజయ్ దేవరకొండ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.
“కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు మొదటిసారి ఆమెను సిల్వర్ స్క్రీన్‌పై చూసి ప్రేమలో పడిపోయాను. ఇక, ఇప్పుడైతే అన్ని విధాలుగా ఆమెను ఆరాధిస్తున్నా”నని రాసుకొచ్చారు. ఈ ట్వీట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. దీనిని చూసిన సినీ ప్రియులు.. ‘మీ ఇద్దరి జోడీని మరోసారి స్క్రీన్‌పై చూసేందుకు ఎదురుచూస్తున్నాం’, ‘ఖుషి అప్‌డేట్‌లు ఇవ్వండి అన్నా’, అంటూ అడుగుతున్నారు. విజయ్ దేవరకొండ – సమంత కాంబోలో సిద్ధమవుతోన్న లవ్ ఎంటర్‌టైనర్ ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.