రకుల్ ప్రీత్.. రోజుకో కొత్త షో !

ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాలతో బాలీవుడ్ లో సందడి చేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఎటాక్, రన్ వే 34, Cuttputlli, డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్  సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ నెలలోనే  డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్ సినిమాలు రిలీజైన విషయం తెలిసిందే. అయితే ఈ ఐదు సినిమాల్లో ఒక్కటంటే ఒక్కటి బ్లాక్ బస్టర్ హిట్ కాలేదు. అదొక్కటే.. రకుల్ ప్రీత్ సింగ్ లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. ఇక వరుస సినిమాల రిలీజ్ నేపథ్యంలో ప్రతిరోజు ప్రమోషన్స్ లో పాల్గొంటోంది.. ఈ పంజాబ్ బ్యూటీ. రోజుకో కొత్త షో చేస్తోంది. సరికొత్త డ్రెస్ లలో సందడి చేస్తోంది.

ఇక ఐదు పోయినా.. మరో ఐదు సినిమాలు రకుల్ ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం ఛత్రివాలి, Meri Patni Ka Remake,  అయాలన్, ఇండియన్ 2,  31 అక్టోబర్, లేడీస్ నైట్ సినిమాల్లో నటిస్తోంది. ఇవి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాన్నాయి. వచ్చే ఏడాది కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రకుల్ సందడి కొనసాగనుంది.