కాంతార.. ‘వరాహ రూపం’ పాట తొలగింపు !
రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాంతార’ బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతోంది. విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమాకు తాజాగా ఎదురుదెబ్బ తగిలింది. ఈ సినిమాలో ప్రత్యేకంగా భావించే ‘వరాహ రూపం’ పాటను ఇకపై ప్రదర్శించకూడదని కేరళలోని కోజికోడ్ జిల్లా సెషన్స్ కోర్టు ఆదేశించింది.
తాము రూపొందించిన ‘నవరసం’ ఆల్బమ్‌కు కాపీగా ‘వరాహ రూపం’ తీర్చిదిద్దారని పేర్కొంటూ కేరళకు చెందిన ‘థాయికుడమ్ బ్రిడ్జ్’ అనే మ్యూజిక్ బ్యాండ్ ఇటీవల న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. విచారణ అనంతరం తాజాగా ఈ తీర్పు వెలువడింది.