సమంతకు ధైర్యం చెప్పిన చిరు
తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు స్టార్ హీరోయిన్ సమంత ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. ఆమె అభిమానులు పోస్టులు పెడుతున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి సామ్ త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. “డియర్ సామ్.. కాలానుగుణంగా మన జీవితాల్లో ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. వాటివల్ల మనకెంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో తెలుస్తుంది. మనోబలం కలిగిన అద్భుతమైన అమ్మాయివి నువ్వు. అతి త్వరలో ఈ సమస్యను నువ్వు అధిగమిస్తావనే నమ్మకం నాకు ఉంది’’ అని చిరు ధైర్యం చెప్పారు.