సీబీఐకి నో ఎంట్రీ బోర్డు

సీబీఐకి తెలంగాణ ప్రభుత్వం నో ఎంట్రీ బోర్డు పెట్టేసింది. రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేసుకునేలా గతంలో అనుమతి ఉండేది. గతంలో సీబీఐకి ఇచ్చిన అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇందుకు సంబంధించి ఆగస్టు 30న జీవో 51ను ప్రభుత్వం జారీ చేసింది.

ఇక రాష్ట్రంలో ఏ కేసునైనా సీబీఐ దర్యాప్తు చేయాలంటే.. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని జీవోలో పేర్కొంది. ప్రస్తుతం కేంద్రం-తెలంగాణ రాష్ట్రం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో సీబీఐ కి కేసీఆర్ సర్కార్ నో ఎంట్రీ బోర్డ్ పెట్టేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు, కవితను అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యతను సంతరించుకుంది.