కంటతడి పెట్టుకున్న సమంత

జీవితంలో ఏరోజు ఎలా ఉన్నా.. పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోయినా.. వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్లాలి. మన ధైర్యం ఏమిటో నిరూపించుకోవాలని తనకు స్నేహితులు చెప్పారు. అదే స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నా అన్నారు సమంత. ప్రస్తుతం మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత.. సెలైన్‌ పెట్టుకుని మరీ ‘యశోద’ డబ్బింగ్ పూర్తి చేశారు. ఇప్పుడు కాస్త ఓపిక చేసుకొని సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా తన అనారోగ్య పరిస్థితిపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వదంతులపై సమంత స్పందిస్తూ..  ఒక్కొక్కసారి.. ఇంకొక్క అడుగు కూడా వేయలేను అనిపిస్తుందని భావోద్వేగానికి గురయ్యారు.

సమంత ప్రధాన పాత్రలో హరి, హరీష్‌ దర్శకులు. వరలక్ష్మి శరత్‌కుమార్‌, ఉన్ని ముకుందన్‌ కీలక పాత్రల్లో యశోధ తెరకెక్కింది. సరోగసి నేపథ్యంలో సాగే ఉత్కంఠ భరిత కథనంతో దర్శకులు ఈ మూవీని తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రాలు చూస్తే అర్థమవుతోంది. ఈ మూవీ నవంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.