ట్రోల్స్.. నన్నెంతగానో బాధపెడుతున్నాయ్ !

ప్రస్తుతం పాన్‌ ఇండియా స్థాయిలో రాణిస్తున్న రష్మిక ఇన్‌స్టాలో తన అంతరంగాన్ని, ఆవేదనని బయటపెట్టారు. ఎన్నో ఏళ్ల నుంచి ఇబ్బంది పెడుతున్న కొన్ని విషయాల్ని అభిమానులతో పంచుకున్నారు. సోషల్ మీడియా వేదికగా తనని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ట్రోలింగ్‌పై నన్నెంతగానో బాధపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.

విమర్శల్ని పట్టించుకోకూడదని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. కానీ ఇప్పుడు పరిస్థితి దిగజారింది. తాను మాట్లాడని విషయాల గురించి కూడా నన్ను ఎగతాళి చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో నా హృదయం ముక్కలైంది
ఈ తప్పుడు సమాచారంతో నాకే కాకుండా, నా సహచరులకి, నా సన్నిహితులకు  ఇబ్బందికరంగా మారిందని చెప్పుకొచ్చింది.