రసమయి రాజీనామా చేయాలి

అధికార పార్టీ నేతలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజా ప్రతినిధులకు గ్రామాల్లో చేదు అనుభవాలు ఎదురువుతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన కాన్వాయ్ పై జనాలు చెప్పులు విసిరారు.

 యువజన సంఘాల నాయకులు భారీ సంఖ్యలో రాజీవ్‌ రహదారిపై బైఠాయించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ రోడ్డన్నా తీసుకురావాలి, లేదా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అంతలోనే బెజ్జంకి మండలం బేగంపేటలో ఓ కార్యక్రమానికి వెళ్తున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ కాన్వాయ్‌ని గుర్తించి యువజన నాయకులు అడ్డుకున్నారు. చెప్పులు విసురుతూ దాడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని లాఠీఛార్జీ చేశారు.