ఓపెనర్ గా పంత్.. అట్టర్ ప్లాప్!

టీమిండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్ ప్రతిభ గల ఆటగాడు. అయితే అతడిలో కచ్చితత్వం లేదు. టెస్టుల్లో పర్వాలేదు. కానీ వన్డే, టీ20 ల్లో పెద్దగా రాణించింది లేదు. దీంతో పంత్ ను ఎందుకు భరిస్తున్నట్లు అని మాజీ ఆటగాళ్లు, ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు.

అయితే పంత్ స్పెషల్ బ్యాటర్.. అతడు ట్రాక్ లో పడితే.. టీమిండియాకు ఓ అద్భుతమైన ఆటగాడు దొరికినట్టు అవుతుందని చెబుతూ వస్తున్నారు. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్న పంత్ ఫామ్ లోకి వచ్చింది లేదు. మెరుపులు మెరిపించింది లేదు. టీ 20 క్రికెట్ లో అతడిని పక్కనపెట్టాలనే డిమాండ్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. 
మరోవైపు పంత్ ను సపోర్ట్ చేసే వాళ్లు.. అతడిని ఓపెనర్ గా పంపిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. ఇప్పుడు హార్దిక్ పాండ్యా అదే చేశాడు.

తాజాగా కివీస్ తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో ఇషాన్ కిషన్ తో కలిసి పంత్ ఓపెనర్ గా బరిలోకి దిగాడు. అయితే టెస్ట్ మ్యాచ్ మాదిరిగా 13 బంతుల్లో 6 పరుగులు చేసి.. లాకీ ఫెర్గూసన్ బౌలింగ్ లో టిమ్స్ సౌధీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో.. పంత్ ఓపెనర్ షో అట్టర్ ప్లాప్ అయినట్టయింది. ఇక అతడిని దేవుడే కాపాడాలి. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 6 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 42 పరుగులతో ఆట కొనసాగిస్తోంది. క్రీజులో ఇషాన్ కిషన్ (24), సూర్య కుమార్ యాదవ్ (6) ఉన్నారు.