వికసించిన బీజేపీ ఐకమత్యం
బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ – కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత మధ్య మాటల యుద్ధం కాస్త దాడులు చేసుకునే దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ కార్యకర్తలు బంజారాహిల్స్ లోని అర్వింద్ ఇంటికి వెళ్లి.. దాడి చేశారు. ఒక విధంగా చెప్పాలంటే విధ్వంసం సృష్టించారు.
అయితే ఈ దాడిని ఖండించే విషయంలో కమలం పార్టీలో ఐకమత్యం కనిపించింది. జాతీయ నేతలు, రాష్ట్రా నేతలు ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. తరుణ్ చుగ్, బండి సంజయ్, ఈటల, విజయశాంతి.. ఇలా కీలక నేతలంతా అర్వింద్ ఇంటికి వచ్చి పరిశీలించారు. అదే సమయంలో కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు.
వాస్తవానికి అర్వింద్ మరీ భరించలేని మాటలు ఏమి మాట్లాడలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కవిత కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నించింది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఫోన్ చేసిందని ఆరోపించారు. గతంలో ఇలాంటి ఆరోపణలు కేసీఆర్ కోకొల్లలు చేశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ని పట్టుకొని రండ మంత్రి అన్నారని గుర్తు చేస్తున్నారు.