15ని॥ల ముందు వెన్నెల కిషోర్’ని టెన్షన్ పెట్టింది !

ఆ 15నిమిషాల ముందు కమెడియన్ వెన్నెల కిషోర్ ని పెట్టింది. ఆమె ఎవరు ? ఎందుకు ?? అంటూ ఎక్కువగా ఆలోచించకండీ. ఈ మేటరు వేరు. సినిమా షెడ్యూల్స్ వాయిదా పడటం. క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంటాయ్. ఐతే, అనుకొన్న షెడ్యూల్ టైం కంటే ఇంకాస్త ముందుగానే (ప్రీ పోన్) షూటింగ్ ప్రారంభం అయితే ఎలాగుంటుంది ?? ఆ షెడ్యూల్ లో పాల్గొనే నటీనటులకు టెన్షన్ తప్పదు. బిజీ ఆర్టిస్టులకు పరిస్థితి చెప్పనక్కర్లేదు. ఇలాంటి టెన్షన్ కే గురయ్యాడు కమెడియన్ వెన్నెల కిషోర్.

శ్రీను వైట దర్శకత్వంలో రవితేజ ‘అమర్ అక్భర్ ఆంథోనీ’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఇలియానా టాలీవుడ్ కు రీ-ఎంట్రీ ఇస్తోంది. ఇందులో కమెడియన్ వెన్నెల కిశోర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో ఆయన పాల్గొంటున్నారు. ఐతే, ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ ని ముందుగా అనుకొన్న సమయానికి కంటే.. 15నిమిషాల ముందు ప్లాన్ చేశారట. దీంతో టెన్షన్ వెన్నల కిషోర్ టెన్షన్ పడ్డాడు.

ఆ విషయాన్ని తెలుపుతూ వెన్నల కిషోర్ ట్విట్ చేశారు. ఓ ట్రిమ్మింగ్‌ వీడియోను పోస్ట్ చేశారు. దానికి ‘టింగ్‌ షెడ్యూలు 15 నిమిషాలు ముందుకు ప్లాన్‌ చేయగా.. మేకప్‌ టైమ్‌ చాలా టైట్‌గా ఉంటుందని’ అంటూ కామెంట్ పెట్టారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెన్నెల కిషోర్ సినిమా కష్టాలు మాములుగా లేవ్ గా అనే కామెంట్ పెడుతున్నారు.