‘యశోద’ వివాదానికి ఎండ్ కార్డ్
స్టార్ హీరోయిన్ సమంత ‘యశోద’ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సమంత నటనపై సినీ విమర్శకులు కూడా ప్రశంసలు కురిపించారు. అయితే ఈ చిత్రంలో ఇవా హస్పిటల్ పేరు వాడటంపై వివాదం రాజుకుంది. ఆ ఆస్పత్రి వర్గాలు ఇటీవల కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీంతో కోర్టు ఈ విషయంలో స్పష్టత వచ్చే వరకు యశోద ఓటీటీ విడుదల ఆపేయాలని ఆదేశాలిచ్చింది.
ఇప్పుడీ.. ఈ వివాదం పరిష్కారం అయింది. దీనిపై నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. చట్టప్రకారమే సమస్యను పరిష్కరించామని చెప్పారు. ఈ సినిమాలో ఇవా అనే పేరును బ్లర్ చేస్తాం. ఈ పేరుతో ఆస్పత్రి ఉందని తెలీదు. ఇది పూర్తిగా యాదృచ్ఛికంగా జరిగింది. ఎవరినీ కించపరచడం మా ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు. ఇక ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడొస్తుందనే విషయం వచ్చే నెలలో ప్రకటిస్తామని చెప్పారు.