స్పోర్ట్స్ జాకెట్.. స్టైలిష్ లుక్‌లో మహేష్

సూప‌ర్ స్టార్ కృష్ణ హ‌ఠాన్మ‌ర‌ణంతో గ‌త కొద్ది రోజులుగా షూటింగ్‌ల‌కు దూరంగా ఉన్న మ‌హేష్‌బాబు తిరిగి సెట్స్‌లో అడుగుపెట్టాడు. దాదాపు ఇర‌వై రోజుల విరామం త‌ర్వాత ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్‌లో పాల్గొన్నాడు. స్పోర్ట్స్ జాకెట్ ధ‌రించి స్టైలిష్ లుక్‌లో క‌నిపిస్తోన్న ఫొటోను మహేష్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దానికి ‘బ్యాక్ టు వ‌ర్క్’ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చాడు. మ‌హేష్ బాబు పోస్ట్ చేసిన ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా తర్వాత వస్తోన్న చిత్రమిది. ఇప్పటికే ఫ‌స్ట్ షెడ్యూల్ పూర్త‌యింది. త్వ‌ర‌లోనే సెకండ్ షెడ్యూల్ మొద‌లుపెట్ట‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.