రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న టీఆర్ఎస్ కీల‌క నేత‌..!!

అధికార టీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరుగ‌తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ప‌ద‌వులు లేనివారే కాదు ప‌ద‌వుల్లో ఉన్న‌వారు కూడా అసంతృప్తితో పార్టీ నుంచి రాజ‌కీయాల నుంచి వైదొలుగుతున్న ప‌రిస్థితి ఏర్ప‌డింది. టీఆర్ఎస్ నేత తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మ‌న్ గా ఉన్న సోమార‌పు స‌త్య‌నారాయ‌ణ రాకీయ స‌న్యాసం తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. క‌రీంగ‌న‌ర్ ఆర్టీసీ బ‌స్టాండ్ కార్యాల‌యంలో ఆయ‌న త‌న మ‌న‌సులో మాట వెల్ల‌డించారు.

అధిష్టానం నిర్ణ‌యం మేర‌కు ప‌నిచేయ‌లేక‌పోతున్నాన‌ని, సీఎం కేసీఆర్ ఆశించిన మేర‌కు ఆర్టీస‌లో ప‌నిచేయ‌లేక‌పోతున్నాన‌ని ఆయన చెప్పారు. గొప్ప‌గా పరిపాల‌న జ‌రుగుతున్న పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ‌తో మెల‌గ‌లేక‌పోతున్నాన‌ని ఆయ‌న తెలిపారు. కేసీఆర్, కేసీఆర్, హ‌రీష్ రావుల‌పై ప్ర‌జ‌లు పూర్తి విశ్వాసంతో ఉన్నార‌ని, పార్టీని ఎవ‌రు వీడినా ఎలాంటి న‌ష్టం లేద‌ని సోమార‌పు స‌త్య‌నారాయ‌ణ అభిప్రాయ‌ప‌డ్డారు.

రామ‌గుండంలో టీఆర్ఎస్ త‌ర‌పున ఏ కోన్ కిస్కా గొట్టంగాడిని పెట్టినా గెలుస్తాడ‌ని, రామగుండం కార్పోరేష‌న్ పై అవిశ్వాసం పెట్ట‌డం పార్టీకి ఇష్టం లేద‌ని అన్నారు. చాలా రోజుల నుంచి రాజ‌కీయాల నుంచి విర‌మించుకోవాల‌నుకుంటున్నాన‌ని, ఇది త‌న వ్య‌క్తిగ‌త విష‌య‌మ‌ని ఆయ‌న చెప్పారు.