ఆప్ కు జాతీయ పార్టీ హోదా ఖాయం
ఏదైనా పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు కలిగి ఉండాలి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. తాజాగా వెలువడుతున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ప్రస్తుత ట్రెండ్ ను బట్టి చూస్తే గుజరాత్ లో కేవలం 6 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. హిమాచల్ ప్రదేశ్ లో అయితే ఖాతా కూడా తెరవలేదు. అయితే రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్ఛడంలో ఆప్ సఫలీకృతం అయినట్టు కనబడుతుంది.
ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఆప్ కు 6 శాతం ఓట్లు దక్కే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. అదే నిజమైతే.. ఆ పార్టీకి జాతీయ పార్టీ హోదా సొంతం చేసుకుంది. ఇక నిన్ననే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ అద్భుత ఫలితాలు సాధించింది. కానీ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లోనూ బీజేపీ హవాకు చెక్ పెట్టాలన్న కేజ్రీవాల్ ఆశలు నెరవేరినట్టు కనిపించడం లేదు.