NBK108 షురూ.. మొదటి రోజే దబిడి దిబిడి !

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య సినిమా (#NBK108) గురువారం ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. తండ్రి ఎన్టీఆర్‌ తో కలిసి బాల‌కృష్ణ న‌టించిన తాత‌మ్మ క‌ల‌, రామ్ ర‌హీమ్‌, అన్న‌ద‌మ్ముల అనుబంధంతో పాటు ప‌లు సినిమాల పోస్ట‌ర్స్‌ను చిత్ర యూనిట్ ప్ర‌త్యేకంగా డిజైన్ చేసింది. ఈ పోస్ట‌ర్స్‌పైన ఫ‌స్ట్ షాట్‌ను చిత్రీక‌రించారు.

ఈరోజు నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమా కోసం హైద‌రాబాద్‌లోనే ఓ భారీ జైలు సెట్ వేసిన‌ట్లు స‌మాచారం. ఈ సెట్‌లోనే కీల‌క యాక్ష‌న్‌ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్న‌ట్లు తెలిసింది. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ ఎవరు ? అన్నది ఇంకా ఖరారు కాలేదు. కానీ ఓ  హీరోయిన్ గా యాంక జ‌వాల్క‌ర్ ని తీసుకున్నారు.