రోహిత్‌ స్థానంలో ఇండియా-ఎ ఆటగాడు

బంగ్లాదేశ్‌ తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ బొటనవేలికి గాయమైన విషయం తెలిసిందే. ఆ బాధను తట్టుకొని మరీ.. జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు రోహిత్. ఆఖర్లో వచ్చి ఫోర్లు, సిక్స్ లతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో అర్థ సెంచరీ చేశాడు. కానీ టీమిండియాను గెలిపించలేకపోయాడు.  5 పరుగులతో తేడాతో భారత్ ఓడింది. గాయం అయిన  నేపథ్యంలో బంగ్లాతో జరగనున్న మూడో వన్డే రోహిత్  దూరమయ్యాడు.

చట్టోగావ్‌ వేదికగా డిసెంబర్‌ 14న ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ రోహిత్‌ ఆడటం లేదు. దీంతో మంచి ఫామ్‌లో ఉన్న ఇండియా-ఎ జట్టు కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌  రోహిత్‌కి బదులు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అభిమన్యు ఈశ్వరన్‌ ప్రస్తుతం జరుగుతున్న ఇండియా- ఎ టెస్టు మ్యాచ్‌లో రెండు వరుస శతకాలను నమోదు చేశాడు. ఓపెనర్‌గానూ ఆడుతున్నాడు. సిల్‌హట్‌లో అతడు తన రెండో టెస్టు మ్యాచ్‌ను ముగించిన తర్వాత చట్టోగావ్కు వచ్చే అవకాశం ఉందంటూ బీసీసీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.