ఢిల్లీ లిక్కర్ స్కాం : కవితను ఏడున్నర గంటలపాటు విచారించిన సీబీఐ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐ విచారణ ముగిసింది. రెండు బృందాల్లో వచ్చిన సీబీఐ అధికారులు.. సుమారు ఏడున్నర గంటలపాటు విచారించి ఆమె నుంచి వివరాలు సేకరించారు. సీఆర్పీసీ 160 కింద కవితను సాక్షిగా మాత్రమే విచారించి వాంగ్మూలం నమోదు చేసినట్టు సమాచారం.
ఎమ్మెల్సీ కవిత 10 ఫోన్లు ధ్వంసం చేశారని అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. ఈ అంశంపైనే ఎక్కువగా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈకేసుకు సంబంధించి ఇప్పటి వరకు ఆమెను సాక్షిగా మాత్రమే విచారించారు. ఇంతటి విచారణ పూర్తయిందా? లేక మరోసారి కవితను విచారాస్తారా? అనే దానిపై సీబీఐ అధికారుల నుంచి ఇంకా స్పష్టత రాలేదు.