రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చిన మెస్సి

ఫిఫా ప్రపంచకప్‌ తర్వాత మెస్సి రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడని ఆయన అభిమానులు ఆందోళనలో ఉన్నారు. అయితే వారికి గుడ్ న్యూస్ చెబుతూ.. ఇప్పట్లో రిటైర్మెంట్‌ ఉండదని స్టార్ ప్లేయర్ ప్రకటన చేసారు.

ఆదివారం ఫ్రాన్స్-అర్జెంటీనా ల మధ్య జరిగిన ఫైనల్ పోరు నరాలు తెగే ఉత్కంఠగా సాగింది. ఈ థ్రిల్లర్ గేమ్ లో  ఈ సాకర్‌ మాంత్రికుడు మెస్సి అర్జెంటీనాకు అద్భుత విజయాన్నందించాడు. మ్యాచ్ అనంతరం మెస్సీ మాట్లాడుతూ.. “‘నేను నా కెరీర్‌ను దీంతో ముగిద్దామని అనుకొన్నాను. ఇప్పటి వరకు నా కెరీర్‌లో అందనది ఇదే. ఇకపై నేను ఏమీ అడగను. నేను కోపా సాధించగలిగాను. ఇప్పుడు ప్రపంచకప్‌ కోసం తీవ్రంగా పోరాడాను. నా కెరీర్‌ చరమాంకంలో దీన్ని సాధించాను. కానీ నేను ఫుట్‌బాల్‌ను ప్రేమిస్తాను. ప్రపంచ ఛాంపియన్‌గా మరికొన్ని గేమ్స్‌ ఆడాలనుకుంటున్నా”నన్నారు. ప్రపంచకప్‌లో ఐదు అంతకంటే ఎక్కువ గోల్స్‌ చేసిన అతిపెద్ద వయస్కుడు మెస్సీనే. ప్రస్తుతం అతడి వయస్సు 35 ఏళ్ల 178 రోజులు.