నిర్భ‌య కేసులో సుప్రీం సంచ‌ల‌న తీర్పు..!!

గ‌తంలో ఢిల్లీలో జ‌రిగిన నిర్భ‌య సంఘ‌ట‌న యావ‌త్ భార‌తాన్ని కుదిపేసిన సంగ‌తి తెలిసిందే. మ‌హిళ‌ల భ‌ద్ర‌త‌పై ఈ సంఘ‌ట‌న పెద్ద విప్ల‌వాన్నే తీసుకొచ్చింది. మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దాడుల‌పై క‌ఠిన చ‌ట్టాల‌ను తీసుకువచ్చేలా చేసింది. సంఘ‌ట‌న జ‌రిగిన‌ప్ప‌టి నుంచి విచార‌ణ కొన‌సాగుతూనే వ‌చ్చింది.గ‌తంలో సుప్రీం ఇచ్చిన తీర్పుపై పిటిష‌న్ దాఖ‌లైన నేప‌థ్యంలో సోమ‌వారం ఈ అంశంపై సుప్రీం మ‌రోసారి విచార‌ణ చేపట్టింది. సోమ‌వారం నిర్భ‌య కేసును విచార‌ణ‌కు చేప‌ట్టిన సుప్రీం తీర్పును ఖ‌రారు చేసింది. నిర్భ‌య ఘ‌ట‌న‌లో దోషుల‌కు మ‌ర‌ణశిక్ష‌ను ఖ‌రారు చేసింది సుప్రీం కోర్టు. శిక్ష‌ను జీవిత‌ఖైదుగా మార్చాలంటూ వారు వేసిన పిటిష‌న్ ను కోర్టు తోసిపుచ్చింది. దోషుల‌కు మ‌ర‌ణ శిక్ష‌ను ఖాయం చేస్తూ సంచ‌ల‌న తీర్పునిచ్చింది సుప్రీం. సుప్రీం తీర్పుపై దేశ‌వ్యాప్తంగా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.