పవన్ తో చిరు సినిమా

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు మెగాస్టార్. బుధవారం వాల్తేరు వీరయ్య టీమ్ అంతా కలిసి ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. చిరు, రవితేజ, బాబీ ఇతర నటీనటులు, టెక్నిషన్లు అంతా కలిసి సరదాగా మాట్లాడారు. ఈ క్రమంలో తమ్ముడు పవన్ కలిసి సినిమా ఎప్పుడు చేస్తున్నారనే ప్రశ్న ఎదురైంది.

దానికి చిరు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఎవరితోనైనా కలిసి నటించేందుకు రెడీ. పవన్ తో కూడా. కాకపోతే.. పవన్ చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తి కానివ్వండి. దాదాపు రెండేళ్ల వరకు పవన్ ఖాళీగా లేరని చెప్పుకొచ్చారు. ఇక ఈ వయసులో చలిలో షూటింగ్, రిస్కీ సీన్స్ చేయడం మీకు అవసరమా ? అని ఓ పాత్రికేయ మిత్రుడు అడగగా.. కచ్చితంగా అవసరం. అలా చేయని రోజును రిటైర్డ్ అవ్వడం బెటర్ అన్నారు. గొడ్డులా కష్టపడటం మాత్రమే తనకు తెలుసు. షూటింగ్ చేసిన తర్వాత తన బాధలు తనకు  ఉంటాయి. వాటిని బయటికి చెప్పను అని చెప్పుకొచ్చారు.