పూనకాలు లోడింగ్.. వచ్చేసింది !

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్నారు.

సినిమాలో చిరు, రవితేజ కలిసి చేసిన పాట పూనకాలు లోడింగ్.. సాంగ్ ను తాజాగా విడుదల చేశారు. రోల్ రైడా లిరిక్స్ అందించిన ఈ పాటను రామ్ మిర్యాలతో కలిసి రోల్ రైడా పాడారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మధ్య మధ్యలో చిరు, రవితేజ గొంతు కలిపారు. ఈ పాటను మీరు వినేయండీ.. !