సీత ప్రేమలో రాముడు.. నిజం కాదట !

రాముడు సీత ప్రేమలో పడ్డాడు. అతి త్వరలోనే సీతారాముల కళ్యాణం జరగనుందిని బాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడ రాముడు తెలుగు హీరో/పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాగా.. సీత బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్. వీరిద్దరు ‘ఆదిపురుష్’ సినిమా కోసం జతకట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో రీల్ సీతా-రాముడు రియల్ గా లవ్ లో పడ్డారని.. ఓ సినిమా వేడుకలో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ చెప్పిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి డార్లింగ్ ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.

ఎక్కడికివెళ్లినా దీని గురించే ప్రశ్నిస్తున్నారు. ఆఖరికి బాలయ్య కూడా వదల్లేదు. అన్‌స్టాపబుల్‌ షోలో సందడి చేసిన ప్రభాస్‌ ను  రాముడు సీతతోనే ఎందుకు ప్రేమలో పడ్డాడు? అని కృతి సనన్ తో ప్రేమ వ్యవహారంపై ప్రశ్నించారు బాలయ్య. అయితే అది పాత వార్త‌‌. అవన్నీ కేవలం ప్రచారాలు మాత్రమేనని కృతి సనన్‌ ఇప్పటికే చెప్పేసింది కదా. ఆ వార్తల్లో నిజం లేదు. ఏమీ లేకపోయినా అనవసరంగా ఇలాంటి గోల చేస్తున్నారు అని ప్రభాస్‌ స్పష్టత ఇచ్చారు.