అమ్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆందోళన
మంత్రి కేటీఆర్ సోనియా గాంధీ ని అమ్మా-బోమ్మా అంటూ సంబోధించడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సీనియర్ నేతలు కేటీఆర్ పై సీరియస్ అయ్యారు. వీహెచ్ లాంటోళ్లు కేటీఆర్ ని మీ ఇంటికొస్తాం తేల్చుకొందామని తీవ్ర హెచ్చరికలు చేశారు. ఐతే, కాస్త ఆలస్యంగానైనా కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు నిరసనని ఉదృతం చేశాయి. ‘భారత్ బచావో’ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాయి. ఐతే, ఈ పోలీసులు ఆందోళనకు అడ్డంపడటంతో సడెన్ గా ప్లాన్ ని మార్చేశారు.. ‘చలో చలో ప్రగతి భవన్’కు పిలుపునిచ్చారు.
ఈ క్రమంలో ఆ పార్టీ సీనియర్ నేత కోమటి రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ఇవ్వడం వల్ల ఏపీలో కాంగ్రెస్ నష్టపోయింది. కాంగ్రెస్ చేసిన త్యాగానికి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన కేసీఆర్… సోనియాగాంధీ ని అమ్మా బొమ్మా అనడం సిగ్గులేని మాటలు అంటూ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కేటీఆర్ నీకు మీ అమ్మ ఏలానో సోనియా గాంధీ తెలంగాణకు అమ్మ. సోనియా గాంధీ ని అమ్మ బొమ్మ అంటవా…నీ ప్రగతి భవన్ కు వస్తున్నం దమ్ముంటే ఆపు అని సవాల్ విసిరారు.