ఫిబ్రవరిలో సమంత ప్రేమకథ !

సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ తెరకెక్కించిన ప్రేమకథ ‘శాకుంతలం’. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం రచన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దుశ్యంతుని పాత్రలో  మలయాళం నటుడు దేవ్‌ మోహన్‌ కనిపించనున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ను సమంత కూడా తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. “అద్భుతమైన లవ్‌స్టోరీ శాకుంతలం మూవీని థియేటర్లలో చూసి ఎంజాయ్‌ చేయండి. ఫిబ్రవరి 17న 3డీలోనూ ఈ సినిమా మీ ముందుకు వస్తోంది” అని సమంత ట్వీట్‌ చేసింది.

ఈ మూవీకి మణిశర్మ మ్యూజిక్‌ అందించారు. గుణశేఖర్‌ కూతురు నీలిమా గుణ నిర్మాత. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ సమర్పణలో ‘శాకుంతలం’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 

ఇక ఫిబ్రవరి 17న ధనుష్ ‘సర్’. విశ్వక్ సేన్ ‘ధమ్కీ’, ‘వినరో భాగ్వము’ రిలీజ్ కాబోతున్నాయి. వీరికి పోటీగా దిల్ రాజు సమంతని తీసుకురావడంతో.. ఇండస్ట్రీలో మరోసారి థియేటర్ గొడవలు తెరమీదకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.