రిషబ్ పంత్ ను ఐసీయూ నుంచి.. ప్రైవేటు వార్డుకు షిఫ్ట్ !
ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆరోగ్యం మెరుగవుతోంది. ఇతర ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా నిన్న సాయంత్రం అతడిని ప్రైవేటు వార్డుకు మార్చారు. మరింత కోలుకునే వరకు దెహ్రాదూన్ అసుపత్రిలోనే చికిత్స ఉంటుంది. ఇప్పటికే నుదుటికి సంబంధించి స్వల్ప ప్లాస్టిక్ సర్జరీని వైద్యులు చేశారు. కాలి లెగ్మెంట్ చికిత్స కోసం విదేశాలకు తరలించే అంశంపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది. ఈ మేరకు ఢిల్లీ క్రికెట్ బోర్డు అప్డేట్ ఇచ్చింది.
డిసెంబర్ 30న దిల్లీ- దెహ్రాదూన్ జాతీయ రహదారిపై పంత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దాదాపు 200 మీ. దూరం కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు కాలి బూడిదైంది. పంత్ ప్రాణాలతో బయటపడ్డారు.