జీవితం అంతకు ముందులా లేదు.. మీ వల్లే ధైర్యంగా ఉన్నా !

స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్‌తో పోరాటం చేస్తూ గత కొంతకాలంగా ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె ట్విటర్‌ వేదికగా అభిమానులతో ముచ్చటించారు. మీ ఆరోగ్యం ఎలా ఉంది ? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు జీవితం అంతకు ముందులా లేదని సమాధానం ఇచ్చింది. అభిమానులు చూపించే ప్రేమాభిమానాల వల్లే తాను ధైర్యంగా ఉన్నానని చెప్పుకొచ్చింది.


ఇక గుణశేఖర్ దర్శకత్వంలో సమంత నటించిన శాకుంతలం ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు మేకర్స్ అప్ డేట్ ఇచ్చారు. మహాకవి కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా ‘శాకుంతలం’ చిత్రాన్ని రూపొందించారు. సమంత, దేవ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. గుణ టీమ్‌ వర్క్స్‌, శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది.