వీరసింహారెడ్డి ఫైట్స్ పవర్ ఫుల్.. నేను చాలా మొరటు.. విలన్ దునియా విజయ్ ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం.. !

ప్రతినాయకుడు బలంగా ఉంటేనే కథానాయకుడిని ఇంకా బలంగా చూపించొచ్చు. అందుకే గాడ్ ఆఫ్ మాస్ నందమూరి బాలయ్య కోసం దర్శకుడు గోపీచంద్ మలినేని పవర్ ఫుల్ విలన్ ను ఎంచుకున్నారు. వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన సినిమా ‘వీరసింహారెడ్డి’. ఇందులో బాలయ్యను ఢీకొట్టే విలన్ పాత్రలో కన్నడ స్టార్ దునియా విజయ్ నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న వీరసింహారెడ్డి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో.. దునియా విజయ్ మీడియా కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. సినిమా, పర్సనల్ కు సంబంధించి దునియా విజయ్ చెప్పిన ఆసక్తికర విషయాలు ఎక్స్ క్లూజివ్ గా మీకు అందిస్తోంది.. మీ ఆంధ్రా వెలుగు డాట్ కామ్.

‘వీరసింహారెడ్డి’తో మీ ప్రయాణం ఎలా మొదలైయింది ?

దర్శకుడు గోపీచంద్ నా పాత్ర గురించి చెప్పినప్పుడే థ్రిల్లింగ్ గా ఫీలయ్యా. సినిమాలో విలన్ పాత్ర ఓ పిల్లర్ లా ఉంటుంది.  ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర అవుతుంది. గోపీచంద్  బ్రిలియంట్ డైరెక్టర్. ఆయన నా వర్క్ ని చూశారు. ఈ పాత్రకు తాను సరిగ్గా సరిపోతానని భావించి తీసుకున్నారు. ఇంత మంచి పాత్రలో బాలకృష్ణ గారి సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం.  

బాలయ్య వ్యక్తిత్వం ఉన్న మనిషి :

బాలయ్య సినిమాలు చూస్తూ పెరిగాను. అలాంటింది ఆయనతో కలిసి నటించడం మాటల్లో చెప్పలేని అనుభూతి. తొలిసారి ఆయన్ని సెట్ లో చూసినప్పుడు నన్ను నేను నమ్మలేకపోయా. బాలయ్య  గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి.

నేను చాలా మొరటు :

వీరసింహారెడ్ది లో ఫైట్స్ పవర్ ఫుల్ గా ఉంటాయి. బాలయ్య ఎనర్జి వేరే లెవల్ లో ఉంటుంది. ఇందులో నా పాత్ర పేరు ముసలిమడుగు ప్రతాప్ రెడ్డి. చాలా మొరటుగా కనిపిస్తా. ఇది వరకు నటించిన పాత్రలకు పూర్తిగా డిఫరెంట్. నా అభిమానులకు, ప్రేక్షకులకు స్వీట్ సప్రైజ్ గా ఉంటుంది.  

గ్రేట్ ఎమోషనల్ జర్నీ :

ఈ సంక్రాంతికి బాలయ్య అభిమానులకు విందు భోజనమే. ఫైట్స్.. డైలాగ్స్.. ఎమోషన్స్ అద్భుతంగా ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. అభిమానులకు, ప్రేక్షకులకు గ్రేట్ ఎమోషనల్ జర్నీ.

తెలుగులో ఇష్టమైన హీరోలు ఎవరంటే ?

టాలీవుడ్ హీరోల్లో అందరూ ఇష్టమే. ఒకరి పేరు చెప్పమంటే కష్టం. ఎవరి ప్రత్యేకతలు వారికి వున్నాయి. సో.. ఐ లైక్ ఆల్.

విలన్ పాత్రలు చేయడానికి రెడీ :

నటుడుగా అన్ని పాత్రల్లో చేయాలన్నది నా కోరిక. వీరసింహారెడ్డి తర్వాత కూడా మంచి పాత్రలు వస్తే కచ్చితంగా విలన్ గా నటిస్తా.   ప్రస్తుతం ‘భీమా’ సినిమాలో నటిస్తున్నా. తెలుగులో కూడా కొందరు సంప్రదించారు. చర్చలు జరుగుతున్నాయి. పాత్ర బలంగా ఉంటే.. ఏ భాషలోనైనా.. ఏ పాత్రలో నటించేందుకైనా తాను సిద్ధం.