తెలుగు సినిమాల్లో డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ లో ఓ మంచి నటుడు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన సోలోగా, ఫ్యామిలీతో కలిసి చేసిన పర్ఫామెన్స్ బ్లాక్ బస్టర్ హిట్. ఐపీఎల్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ కు ఆడిన వార్నర్  కి ఇక్కడ అభిమానులతో ప్రత్యేక అనుబంధం ఉంది. టాలీవుడ్ టాప్ స్టార్స్ మహేష్, అల్లు అర్జున్, ఎన్ టీఆర్.. ఇలా ఎవరిని వద్దల్లేదు. మీమ్స్ , డ్యాన్సులతో వరల్డ్ వైడ్ గా ట్రెండింగ్ అయ్యారు.

ఈ నేపథ్యంలో.. వార్నర్ ముందు ఓ బిగ్ ప్రపోజల్ పెట్టింది నెటి ఫ్లిక్స్ . డేవిడ్ వార్నర్ క్రికెట్‌ నుంచి వీడ్కోలు పలికిన తర్వాత.. తెలుగు సినిమాల్లో నటించాలి. ఇదే అతడికి సరైన వేదికగా మేం భావిస్తున్నాం అని నెట్‌ఫ్లిక్స్ ట్వీట్‌ చేసింది. దీనికి స్పందించిన డేవిడ్ వార్నర్.. నవ్వుతున్న ఎమోజీలను రీట్వీట్‌ చేశాడు.