VT12 ‘గాండీవధారి అర్జున’

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చింది. ఈరోజు వరుణ్ తేజ్ బర్త్ డే కానుకగా ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ‘గాండీవధారి అర్జున’ టైటిల్ ను పెట్టారు.  చాలా వైవిధమైన టైటిల్ ను ఫిక్స్ చేసిన ప్రవీణ్ సత్తారు.. ఫస్ట్ లుక్ తోనే ఇది యాక్షన్ ఎంటర్ టైనర్ ను స్పష్టత ఇచ్చారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ను సాలిడ్ యాక్షన్ ఏపీసోడ్ నుండి కట్ చేశారు.

వరుణ్ తేజ్ కు ప్రేమకథలు పర్ ఫెక్ట్ గా సూటవుతాయి. ఫిదా, తొలిప్రేమ, ఎఫ్ 2 .. తేజు హిట్ జాబితాలో ఉన్నవన్నీ క్లాస్ సినిమాలే. ఒక్క గద్దలకొండ గణేష్ మినహా.. ఆయన చేసిన యాక్షన్ ఎంటర్ టైనర్లు పెద్దగా ఆడలేదు. అయినా.. మరోసారి ధైర్యం చేసి యాక్షన్ లోకి దిగారు మెగాప్రిన్స్. మరీ.. ‘గాండీవధారి అర్జున’ ఏ మేరకు అభిమానులను ఆకట్టుకోనుంది ? అన్నది చూడాలి.