మెగాస్టార్ ఆల్ ఇండియా రికార్డ్

మెగాస్టార్ చిరంజీవి ఆల్ ఇండియా రికార్డ్ కొట్టారు. బాబీ దర్శకత్వంలో ఆయన నటించిన సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తొలి మూడ్రోజులోనే రూ. 105 కోట్లు కలెక్ట్ చేసింది. యూఎస్ లోనూ హవా చూపిస్తోంది. తాజాగా అక్కడ 2 మిలియన్ మార్క్ ను అందుకుంది. తద్వారా 2023 లో యూఎస్ బాక్సాఫీస్ వద్ద 2 మిలియన్ మార్క్ అందుకున్న తొలి ఇండియన్ సినిమాగా మెగాస్టార్ సరికొత్త రికార్డ్ సృష్టించారు.

వాల్తేరు వీరయ్య రొటీన్ యాక్షన్ ఎంటర్ టైనర్ అయినా.. మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. ముఖ్యంగా పాటలు, ఫైట్లు, డ్యాన్సుల్లో మెగాస్టార్ ఇరగదీశాడు. మాస్ మహరాజాతో కలిసి మెగాస్టార్ చేసిన పూనకాలు లోడింగ్.. వీర లెవల్ లో ఉంది. సంక్రాంతి సీజన్ పోయినా.. వీరయ్య హవా ఏమాత్రం తగ్గడం లేదు.