Thalapathy67 లుక్.. సూపర్బ్ !

ఈ ఏడాది ‘వారసుడు’తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు కోలీవుడ్ స్టార్ విజయ్. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని తమిళ ప్రేక్షకులు మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్క తమిళ్ లో మాత్రమే తెలుగు.. హిందీ లోనూ వారసుడు కు మంచి టాక్.. కలెక్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే కలెక్షన్స్ రూ. 200 కోట్లు దాటిపోయాయి. యూఎస్, యూకే బాక్సాఫీస్ దగ్గర 2 మిలియన్ మార్క్ దాటిపోయాయ్.

ఇక విజయ్ తదుపరి సినిమా (#Thalapathy67) లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో ఉండనున్న సంగతి తెలిసిందే. మాస్టర్ తర్వాత వీరి కాంబోలో రాబోతున్న సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ఉంటుందని లోకేశ్ ఇది వరకే చెప్పిన సంగతి తెలిసిందే.

అంతేకాదు.. ఫిబ్రవరిలో #Thalapathy67అప్ డేట్ ఉంటుందని చెప్పారు. దానికోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే విజయ్-లోకేష్ సినిమా పనులు షురూ అయ్యాయి. విజయ్ లుక్ ఫైనల్ అయిందని అంటున్నారు. అంతేకాదు.. విజయ్ లెటేస్ట్ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది #Thalapathy67 కోసమే అనే ప్రచారం జరుగుతుంది.