తమన్నా ‘జైలర్’ లుక్

సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ 169వ చిత్రమిది. ఈ చిత్రానికి నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా నుంచి వరుసపెట్టి సడన్ సప్రైజ్ లు క్యూ కడుతున్నాయి. ఇటీవలే సునీల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సీరియస్ లుక్ లో భయంకరంగా కనిపిస్తున్న సునీల్.. మెయిన్ విలన్ రేంజ్ లో కనిపించారు.

తాజాగా ఈ సినిమా నుంచి మిల్కీ బ్యూటీ తమన్నా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
ఈ యాక్షన్ కామెడీ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనున్నారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ (శివన్న), బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శివరాజ్ కుమార్ నటిస్తున్న తొలి తమిళ సినిమా ఇది. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో ‘జైలర్’ తెరకెక్కనుంది. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ‘జైలర్’ ను రిలీజ్ చేయనున్నారు.