#TuJhoothiMainMakkaar ట్రైలర్ డేట్ ఫిక్స్

లవ్ రంజన్ దర్శకత్వంలో రణ్ బీర్ కపూర్ – శ్రద్ధా కపూర్ జంటగా నటించిన చిత్రం #TuJhoothiMainMakkaar. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథంలో ఇప్పటి నుంచే ప్రమోషన్స్ షురూ చేస్తోంది చిత్ర యూనిట్. ఈ నెల 23న ట్రైలర్ రిలీజ్ కు డేట్ ఫిక్స్ చేశారు.

ఇక ఈ నెల 25 నుంచి థియేటర్స్ లో సందడి చేయబోతున్న సూపర్ స్టార్ షారుక్ ఖాన్ ‘పఠాన్’ థియేటర్స్ లో  #TuJhoothiMainMakkaar ట్రైలర్ ను ప్రదర్శించబోతున్నారు. ఈ చిత్రంలో డింపుల్ కపాడియా, బోనీ కపూర్‌, అనుభవ్ సింగ్ బస్సీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అజయ్ దేవగన్ గెస్ట్ రోల్ లో మెరవనున్నారు. ఈ చిత్రానికి సంగీతం  ప్రీతమ్. లవ్ ఫిల్మ్స్ మరియు టి-సిరీస్ ఫిల్మ్స్ నిర్మించాయి.