12 వేల ఉద్యోగాల కోత

ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు గూగుల్‌ ప్రకటించింది. అమెరికాలో ఉద్యోగులపై తక్షణమే ఈ ప్రభావం ఉండబోతోందని తెలిపింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ఉద్యోగులకు ఇ-మెయిల్‌ ద్వారా సమాచారమిచ్చారు.

మాంద్యం ముంచుకొస్తుందని అనే ఊహాగానాల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్‌, మెటా, ట్విటర్‌, అమెజాన్‌ వంటి పెద్ద పెద్ద కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌ మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌ సైతం భారీ సంఖ్యలో ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 12 వేల మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది.